బేసిన్స్, షవర్స్, ఫాసెట్స్ మొదలైనటువంటి బాత్‌రూం వస్తువులను మనం ప్రతిరోజూ వినియోగిస్తాం మరియు అవి మన బాత్‌రూం అందంగా కనిపించేలా చేస్తాయి. మనం వినియోగించే స్టైలిష్ బాత్ ఉత్పత్తులు వాటికి అనుబంధంగా ఉండే బాత్‌రూం ఫిట్టింగ్ వ్యవస్థ లేకపోతే అసంపూర్ణంగా ఉంటాయి. ఈ బాత్‌రూం ఫిట్టింగ్స్ కనిపించవు కానీ ఉత్తమమైన బాత్‌రూం అనుభవం పొందడానికి అవి ఆ చివరి చర్యను చేరుస్తాయి.
జాక్వార్ గ్రూప్ ద్వారా ఎస్కో మీ బాత్‌రూం అనుభవం సుసంపన్నంగా మరియు సమృద్ధిగా చేసే అనుబంధ బాత్ ఫిట్టింగ్స్ యొక్క విస్తృత శ్రేణిని అందిస్తోంది. దృఢమైన, మన్నికైన మరియు తుప్పురహితమైన బాత్‌రూం ఫిట్టింగ్స్ దీర్ఘకాలం మన్నిక కోసం రూపొందించబడ్డాయి. జాక్వార్ గ్రూప్ ద్వారా ఎస్కో ఈ కింది అనుబంధ బాత్‌రూం ఫిట్టింగ్స్ ను అందిస్తోంది:
హ్యాండ్ షవర్ (నీటిని మళ్లించడానికి డైవర్టర్ నాబ్ తో) ను కనక్ట్ చేసే ఏర్పాటుతో బకెట్ ను లేదా బాత్‌టబ్ ను నింపడానికి లేదా బాత్‌టబ్ స్పౌట్ ను స్నానం చేసే ప్రాంతంలో ఉపయోగిస్తారు. ఈ డివైజ్ వాటర్ మిక్సర్, డైవర్టర్ మొదలైన వాటికి సాధారణంగా కనక్ట్ చేయబడుతుంది.
షవర్ ఆర్మ్ నీళ్లు పైపులోకి తిరిగి కారకుండా నివారిస్తుంది మరియు షవర్ కు అమర్చిన తరువాత మరింత సొగసైన రూపం అందిస్తుంది.
సింగిల్ లీవర్ డైవర్టర్ స్పౌట్ మరియు షవర్‌హెడ్ మధ్య నీటి ప్రవాహం యొక్క స్విచ్ ని అనుమతిస్తుంది. ఇతర అవసరమైన ఫంక్షనల్ ఫిట్టింగ్స్ తో గోడలో అది దాగి ఉంటుంది.
వ్యర్థపు నీటి పైప్ ను సెరామిక్ బేసిన్ తో జోడించడానికి వేస్ట్ కప్లింగ్ ఉపయోగించబడుతుంది. ఇది పైపులోకి పదార్థాలు ప్రవేశించకుండా నివారించడం ద్వారా లీక్‌లు లేని కనెక్షన్ ను అందిస్తుంది మరియు అడ్డంకులను నివారిస్తుంది.
జెట్ స్ప్రే అనగా కేంద్రీకరించబడిన వలయాకారపు స్ప్రే. ఇది నీటిని విరజిమ్ముతుంది. ఇది కేంద్రీకరించబడిన పరిశుభ్రతమ రియు ఆరోగ్య లక్ష్యాలు కోసం ఉపయోగించబడుతుంది
బాటిల్ ట్రాప్ బేసిన్ ప్లంబింగ్ కోసం ప్రధానమైనది. సింక్ పైప్ ద్వారా మీ బాత్‌రూంలోకి ఏవైనా సీవర్ గ్యాస్‌లు ప్రవేశించడాన్ని గ్రహించి మరియు అడ్డుకోవడంలో సహాయపడుతుంది.
హెల్త్ ఫాసెట్స్ అనగా చేతితో ఉపయోగించే స్ప్రే డివైజ్‌లు. దీనికి ఉన్న నోజల్ మంచి నీటి ధారను అందిస్తుంది మరియు సాధారణంగా ఇది టాయిలెట్ సమీపంలో గోడకు జోడించబడుతుంది.
జాక్వార్ గ్రూప్ ద్వారా ఎస్కో నుండి అల్లైడ్ బాత్‌రూం ఫిట్టింగ్స్ ఎలాంటి అవాంతరాలు లేకుండా దీర్ఘకాలం పని చేయడానికి గాను రూపొందించబడ్డాయి. మా బాత్ ఫిట్టింగ్స్ మీ బాత్‌రూం కోసం పరిపూర్ణమైనవి, మరియు దానికి గల కారణాలు ఇక్కడ తెలుసుకోండి:
మా అల్లైడ్ బాత్ ఫిట్టింగ్స్ దీర్ఘకాలం కోసం రూపొందించబడ్డాయి. అవి బలమైనవి మరియు వాటికి తుప్పు పట్టదు, విరిగిపోవు లేదా సులభంగా పగిలిపోవు.
ఎస్కో ఉత్పత్తులు ఉత్పత్తి యొక్క నాణ్యతతో రాజీ లేకుండా అత్యంత సరసమైన ధరలకు లభిస్తాయి.
అన్ని ఎస్కో ఉత్పత్తులు తడి, తేమ పరిస్థితులలో వాడటానికి ఉద్దేశ్యించబడినప్పటికీ, సాధారణంగా రోజూ చేసే శుభ్రంతో తుప్పు పట్టకుండా మా క్రోమ్ ప్లేటెడ్ ఉత్పత్తులు నిర్థారిస్తాయి.
సాటిలేని కస్టమర్ సర్వీస్ ను నిర్థారించడానికి కట్టుబడి, ఎస్కో మాతృ సంస్థ జాక్వార్ యొక్క సూత్రాలు ఆధారంగా అమోఘమైన ఆఫ్టర్-సేల్స్ సర్వీస్ ను అందిస్తోంది.