Trade EnquiryTrade Enquiry Find DealershipFind Dealership

మా గురించి

జాక్వార్ ద్వారా ఎస్కో

ఆరు దశాబ్దాలకు పైగా బాత్‌రూం బ్రాండ్ ఎస్కో భారతదేశంలో సంఘటిత బాత్ పరిశ్రమలో బెంచ్ మార్క్ గా నిలిచింది. జాక్వార్ గ్రూప్ ద్వారా ఎస్కో నిజమైన నాణ్యత యొక్క విలువను మరియు విశ్వశనీయమైన సర్వీస్ ను తర తరాలుగా ప్రదర్శిస్తోంది. ఈ బ్రాండ్ సమర్థవంతమైన పనిని అందించి, సులభంగా పొందగలిగే ధరలలో గొప్ప అందాన్ని వాగ్థానం చేసే ఉత్పత్తులను రూపొందించి మరియు అందించడంలో నాణ్యత మరియు తక్కువ ధరల మూలస్థంభాల పై రూపొందింది. బ్రాండ్ భారతదేశంలోని టియర్-II, III & IV పట్టణాలలో వేగంగా విస్తరిస్తున్నందున, ఎస్కోకు మొత్తం 4000+ స్టోర్స్ లో రిటైల్ ఉనికి ఉంది మరియు జాక్వార్ గ్రూప్ 2023 సంవత్సరం నాటికి రీటైల్ శక్తిని 5000+ అవుట్‌లెట్స్ కు పెంచే లక్ష్యాన్ని కలిగి ఉంది.

భారతదేశంలో బ్రాండెడ్ బాత్ ఫిట్టింగ్స్ భావనలో ఎస్కో మార్గదర్శకత్వం వహించింది మరియు ఈ రోజు మార్కెట్ లో అత్యంత గౌరవప్రదమైన బ్రాండ్స్ లో ఒకటిగా నిలిచింది. నేడు ఈ బ్రాండ్ బాత్ ఫిట్టింగ్స్, స్యానిటరీవేర్, వాటర్ హీటర్ మరియు బాత్‌రూం యాక్ససరీస్ లో విస్తృత శ్రేణి డిజైన్ ఆప్షన్స్ లో సంపూర్ణమైన బాత్‌రూం పరిష్కారాలను అందిస్తోంది. ప్రముఖ బ్రాండ్స్ లో ప్రధానమైన ఆకర్షణగా నిలిచిన ఎస్కో తన రెండు ప్రధామైన ఫీచర్స్ యైన నిజమైన నాణ్యత మరియు నమ్మకమైన సేవలకు మరియు 10 సంవత్సరాల వారంటీ వాగ్థానానికి ప్రాతనిధ్యంవహిస్తోంది.

Jaquar Head Office

ద గ్రూప్

  • జాక్వార్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బాత్ బ్రాండ్స్ లో ఒకటి. యూరప్, మిడిల్ ఈస్ట్, ఆసియా-పసిఫిక్, ఆఫ్రికా, మరియు సార్క్ (SAARC) ప్రాంతాల్లోని 55 కు పైగా దేశాల్లో బ్రాండ్ ఉనికి ఉంది.
  • భారతదేశంలో 7 అత్యాధునిక తయారీ యూనిట్లు మరియు దక్షిణ కొరియాలో 1 ఆధునిక తయారీ యూనిట్ తో ఆధునిక యంత్రాలు మరియు ప్రక్రియలతో 3,30,000 చదరపు మీటర్లలో విస్తరించింది.
  • భివాడీలో 4 ప్లాంట్స్ ఉన్నాయి (ఫాసెట్స్ కోసం 2, లైటింగ్ కోసం 1, మరియు షవర్ ఎన్‌క్లోజర్స్ కోసం 1)
  • 1 వెల్‌నెస్ ప్లాంట్ - మనేసర్ (అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం)
  • 1 స్యానిటరివేర్ ప్లాంట్ - గుజరాత్ లో అతి పెద్ద ప్లాంట్ కుండ్లీ, హర్యాణాలో 1 వాటర్ హీటర్ ప్లాంట్
  • కుండ్లీ, హర్యాణాలో 1 వాటర్ హీటర్ ప్లాంట్
  • దక్షిణ కొరియాలో 1 ప్లాంట్
  • సంవత్సరానికి 3.8 మిలియన్‌ల స్యానిటరీవేర్ పీస్‌లను అందిస్తుంది
  • ప్రతి ఏడాది 2.9 మిలియన్‌లకు పైగా బాత్‌రూమ్స్ ను అందిస్తుంది మరియు సంవత్సరానికి 39 మిలియన్స్ కు పైగా బాత్ ఫిట్టింగ్స్ ను ఉత్పత్తి చేస్తుంది
  • అంతర్జాతీయంగా అంకితభావంతో పని చేసే 12000 కు పైగా ఉద్యోగులు ఉన్నారు
  • శ్రేణిలో ఉత్తమమైన కస్టమర్ సర్వీస్ కు అంకితమైన, జాక్వార్ గ్రూప్ ప్రస్తుతం 1200 మంది అనుభవజ్ఞులైన సర్వీస్ టెక్నీషియన్స్ ను నియామకం చేసింది
  • జాక్వార్ గ్రూప్ వివిధ బ్రాండ్స్ ద్వారా బాత్‌రూం మరియు లైటింగ్ పరిశ్రమ యొక్క వివిధ విభాగాలకు సేవలు అందిస్తుంది
  • జాక్వార్ గ్రూప్ ప్రస్తుత టర్నోవర్ గణాంకాలు: 2023 సంవత్సరం-24: 6565 కోట్లు